Akhil Akkineni | అక్కినేని అఖిల్‌కు ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ పడలేదు. భారీ అంచనాలతో వచ్చిన ‘అఖిల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. దీని తర్వాత సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘హాలో’ కూడా యావరేజ్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ మజ్ను’ అయితే డిజాస్టర్‌గా నిలిచింది. గతేడాది దసరాకు ‘మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో అఖిల్ మొదటి హిట్‌ను అందుకున్నాడు. సినిమా కమర్షియల్‌గా భారీ సక్సెస్ కాకపోయినా మంచి హిట్‌ను సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నాడు.
‘ఏజెంట్’ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, అఖిల్‌తో బాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైన చర్చలు జరుగుతున్నాయట. కరణ్ జోహర్ ఇప్పటికే ఈ చిత్ర కథను సిద్ధం చేయించాడని టాక్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ ఓ బాలీవుడ్ దర్శకుడిని కూడా లైన్లో పెట్టినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కరణ్ జోహార్ పేరు క్రమంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.