ప్రముఖ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా, దర్శక ధ్వయం డుయో నితిన్, భరత్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్కు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే పేరును ఖరారు చేశారు. మాంక్స్ అండ్ మంకీస్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపికా పిల్లి కథానాయిక. గురువారం టైటిల్ ప్రకటించి, ఫస్ట్‌లుక్, మోషన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. గ్రీన్ బ్యాక్‌డ్రాప్‌లో దీపిక కళ్లలోకి చూస్తూవున్న ప్రదీప్ ఫస్ట్‌లుక్ పోస్టర్ వారిద్దరి పాత్రల కెమిస్ట్రీని ఆవిష్కరించింది. ఓ గ్రామంలోకి పనిమీద వచ్చిన సివిల్ ఇంజనీర్ అక్కడి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్‌గౌడ్, రోహిణి, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సందీప్ బొల్లా, సంగీతం: రథన్, కెమెరా: ఎం.ఎన్.బాలరెడ్డి,