Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘OG (They Call Him OG)’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్నిసాధించింది. ప్రముఖ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సినిమా, విడుదలైన మొదటి వీకెండ్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా సరికొత్త అవతారంలో కనిపించగా, ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే సినిమాలో పవన్ చిన్న వయసు పాత్రలో అఖీరా నందన్ కనిపిస్తాడని సినిమా రిలీజ్‌కి ముందు అనేక ప్రచారాలు సాగాయి. అయితే చిత్రం రిలీజ్ అయ్యాక అకీరా లేకపోడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే అకీరా ఎందుకు కనిపించలేదని అభిమానులలో చర్చ మొదలైంది.
ఈ చర్చకు ముగింపు పలికేలా, యువ నటుడు ఆకాష్ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. OG చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్న వయసు పాత్ర అఖీరా నందన్‌తో చేయిస్తే బాగుంటుందన చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన పొడవు వల్లనే ఆయన సినిమాలో నటించలేదట. పవన్ యంగ్ వర్షన్‌కు కంటిన్యుటీలో అంతరాయం వస్తుందని దర్శకుడు సుజీత్ భావించారు. అందుకే నాకు ఆ పాత్రను ఆఫర్ చేశారు” అని ఆకాష్ వివరించారు. ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్లో కనిపించి అలరించారు. ఇక ప్రియాంక మోహన్ కథానాయికగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.
ఈ సినిమాకు మాస్ బీట్స్‌తో టెంపో పెంచిన ఎస్. థమన్ సినిమా సక్సెస్‌లో సగభాగం అయ్యాడు. చిత్రం నుండి విడుదలైన పాటలు ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి. ‘OG’ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే అత్యంత వేగంగా రూ.250 కోట్లు దాటిన చిత్రంగా నిలిచింది. సుజీత్ స్టైల్, పవన్ పవర్, థమన్ మ్యూజిక్ కలిసి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ బుల్లెట్‌గా మార్చాయి. మరి సినిమా లాంగ్ రన్లో ఇంకా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇక సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న క్రమంలో ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను అక్టోబర్ 1న సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.