Akhil Akkineni Naatu Naatu | ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించగా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌ను నమోదు చేయడమే కాకుండా ఆస్కార్ అవార్డును అందుకుంది. అయితే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అక్కినేని వారసుడు అఖిల్ డాన్స్ చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన సన్నిహితుల పెళ్లి వేడుకకు హాజరైన అఖిల్ ఈ వేడుకలో స్నేహితులతో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్ తన ప్రాజెక్టులను ఎంచుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ముగ్గురి దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
#NaatuNaatu Song Steps by #AkhilAkkineni pic.twitter.com/egNErJK8Uq
— Milagro Movies (@MilagroMovies) February 22, 2025