Akhil- Zainab | నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జైనబ్‌తో జూన్ 6న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున నివాసంలో ప్రైవేట్ వేడుకగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియో సోషల్ మీడియాలోతెగ హల్చల్ చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలని ఒప్పించి గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక జూన్ 6న వివాహం చేసుకోగా, జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా అఖిల్, జైనబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.
ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో నూతన జంటతో పాటు నాగార్జున వియ్యంకుడి ఫ్యామిలీ కూడా కలిసి ఫోటో దిగారు. అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగింది. గ్రూప్ ఫోటోలో అఖిల్, నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరు నాగ సుశీల, సుశాంత్, సుప్రియ, సుమంత్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ పిక్ చూడముచ్చటగా ఉంది.
వెడ్డింగ్ రిసెప్షన్ లో అఖిల్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపించాడు. ఇక జైనబ్ క్రీమ్ కలర్ లాంగ్ గౌన్ ధరించి మెరిసిపోయింది. తమిళ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలసి అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హజరయ్యారు. రాకింగ్ స్టార్ యష్ కూడా సందడి చేశారు. నాచురల్ స్టార్ నాని తన వైఫ్ తో ఈ రిసెప్షన్‌కి హాజరై సందడి చేశారు. హీరో నిఖిల్ తన భార్య, బిడ్డతో కలిసి రాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూడా వేడుకలో సందడి చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత దంపతులతో పాటు సితార కూడా ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు విషెస్ తెలిపారు. డైరెక్టర్ సుకుమార్. సతీసమేతంగా వేడుకకి హాజరయ్యారు. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ వేడుకకి వచ్చి నూతన దంపతులకి శుభాకాంక్షలు అందించారు. సుధీర్ బాబు, అల్లరి నరేష్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా వేడుకలో సందడి చేశారు.
The Akkineni family extends a heartfelt welcome to the beloved superstar @urstrulyMahesh & family.
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/tpP2Dq51pK
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025