‘ఈ సినిమా ైక్లెమాక్స్ హార్డ్హిట్టింగ్గా ఉంటుందని మేము ప్రమోషన్లో చెబితే అది పబ్లిసిటీ స్టంట్ అని కొందరన్నారు. కానీ ఇప్పుడు వారే సినిమా ఎమోషనల్‌గా ఉందని, మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి’ అన్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన షోరన్నర్‌గా, ఓ నిర్మాతగా తెరకెక్కించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖిల్‌రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. బన్నీవాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు.
శుక్రవారం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాను ప్రతీ ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారని, ఓ స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడు నిజాయితీతో తెరకెక్కించారని బన్నీ వాసు తెలిపారు. ఈ సినిమా విషయంలో తమ నమ్మకం నిజమైందని నిర్మాత రాహుల్ మోపిదేవి అన్నారు. ఈ సినిమాతో తన పదేళ్ల కష్టం ఫలించిందని హీరో అఖిల్‌రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయామని తన ఫ్రెండ్స్ చెబుతున్నారని కథానాయిక తేజస్విని తెలిపింది.