జయాపజయాలకు అతీతమైన హీరోలు కొందరుంటారు. వారిలో అక్కినేని అఖిల్ ఒకరు. అతనికి సక్సెస్‌తో నిమిత్తం లేదు. అలాగే అభిమానులకు కొదవా లేదు. ముఖ్యంగా లేడీ ఫాన్ ఫాలోయింగ్‌లో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు. అందుకేనేమో సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. త్వరలో అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది.
ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రూ. 80కోట్లని వినికిడి. కథ నచ్చడంతో యూత్‌లో అఖిల్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ సాహసం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. మిగిలిన వివరాలు తెలియాల్సివుంది. అక్కినేని అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.