Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు తన కెరీర్లో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. “ఏజెంట్” మూవీ ఫెయిల్యూర్ తర్వాత పెద్ద సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్, ఇప్పుడు “లెనిన్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తవగా, మిగిలిన భాగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవనున్నాయి. త్వరలోనే ఆఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతుందని టాక్. అంతేకాదు, ప్రమోషన్స్ కూడా అదే సమయంలో మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
“లెనిన్” నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రగ్గ్డ్ లుక్‌లో అఖిల్ కనిపించిన విధానం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. మైథాలజీ టచ్‌తో రూపొందించిన గ్లింప్స్ వీడియో.. సినిమాపై బజ్ పెంచింది. ఈ సినిమాకు “వినరో భాగ్యం విష్ణు కథ” ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామిగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ సాహిత్యం, సంగీతం అందిస్తున్నారు.
మొదట అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా అనౌన్స్ చేసినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆమె స్థానంలో భాగశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఇప్పటికే శ్రీలీలతో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను భాగశ్రీతో తిరిగి షూట్ చేయాల్సి రావడం వల్ల కొంత డబుల్ వర్క్ అయినా, మూవీ ప్రొగ్రెస్స్ లో ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకు సాగుతోంది. అఖిల్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. “లెనిన్” సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ప్రాజెక్ట్‌తో అఖిల్ తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించగలరా అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మొత్తానికి, “లెనిన్” మూవీ అఖిల్ కెరీర్లో కీలకంగా మారనుంది. సినిమా రిలీజ్ తేదీ నవంబర్ 17గా ఫిక్స్ కావడంతో, అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ఈ సారి అఖిల్ బ్లాక్‌బస్టర్ కొడతాడో లేదో చూడాలి.