Akhil | మొహం నిండా గాయాలతో అఖిల్.. వైరల్ అవుతున్న ‘ఏజెంట్’ లేటెస్ట్ ఫోటోస్
Akhil | అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తీగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ ‘రా ఏజెంట్’గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతుంది.
హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. కాగా అఖిల్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. మొహం నిండా గాయాలతో ఉన్న ఈ ఫోటోలను చూస్తుంటే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

