Akkineni Akhil | అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైనమెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకరతో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన అఖిల్ పోస్టర్లు సినిమాపైన భారీ అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అఖిల్ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నట్లు టాక్. వరుస ఫ్లాప్స్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో అఖిల్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ చిత్రం విజయంతో ఏజెంట్ సినిమాకోసం అఖిల్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. కండలు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపించబోతున్నాడు. అఖిల్ ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా పనిచేయనున్నాడు. అఖిల్‌కు జోడిగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను మొదలు పెట్టిన చిత్రం కరోనా కారణంగా బ్రేక్స్ పడుతూ ఉంది. ఈ నెల 15నుంచి ఏజెంట్ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనుంది. ఇందులో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించనున్నాడు.