Akhil 6 | టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సరైన బ్రేక్ ఎదురుచూస్తున్న వారిలో టాప్‌లో ఉంటాడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) . వివి వినాయక్ డైరెక్షన్లో ‘అఖిల్’ సినిమాతో లీడ్ యాక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన ఈ అక్కినేని యాక్టర్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. 2023లో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సారి సరికొత్త ప్రయత్నంతో సక్సెస్ కొట్టాలనే కసితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్.
తాజాగా అఖిల్ 6 (Akhil 6) ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు.. అంటూ పిడికిల్ బిగించిన లుక్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అఖిల్ చేతి మణికట్టుపై ఖడ్గంతో డిజైన్ చేసిన కడెంను చూడొచ్చు. అఖిల్ ఈ సారి ఏదో గట్టి ప్లాన్‌తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
వినరో భాగ్యము విష్ణు కథ ఫేం మురళీ కిశోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
No war is more violent than love.🔥#Akhil6 – Title glimpse unveils on 08.04.25. @AkhilAkkineni8 @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @AnnapurnaStdios #ManamEntertainments @SitharaEnts pic.twitter.com/b6maL1dQJ6
— BA Raju’s Team (@baraju_SuperHit) April 7, 2025