అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ -2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదలకానుంది. నేడు అఖిల్ జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో అఖిల్ ైస్టెలిష్గా కనిపిస్తున్నారు. ‘ఈ సినిమాలో అఖిల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మమ్ముట్టి పాత్ర కీలకంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్హాప్ తమిళ, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.