అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇది రాయలసీమ నేపథ్యంలో కూడిన కథ అని అందరికీ తెలిసిందే. చిత్తూరు పరిసరాల్లో ఈ కథ సాగుతుందని సమాచారం. అయితే.. ఇందులో అఖిల్ పాత్ర నేపథ్యం ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందట.
సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకూ కమ్యూనిజానికి పొత్తు కుదరదు. ఇందులో హీరో పేరు లెనిన్. ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు పేరు అది. ఆ పేరుకూ, అతని ఆహార్యానికీ పొంతన లేకపోవడం గమనార్హం. నుదుటన బొట్టు.. పెరిగిన గడ్డం.. దేవుడి బొమ్మతో మెడలో వేళ్ళాడే గొలుసు. ఇలా విభిన్నంగా అఖిల్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అతని ఆహార్యానికీ, పేరుకీ.. సినిమా కథకూ ఊహించని సంబంధం ఉంటుందని తెలుస్తున్నది. అఖిల్ కెరీర్లోనే నెవర్ బిఫోర్ అనిపించేలా క్యారెక్టరైజేషన్ ఉంటుదట. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.