తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇపుడు స్టార్ హీరోలు ఎక్కువగా జపిస్తున్న పేరు పూజాహెగ్డే (Pooja Hegde). తమ సినిమాలో ఈ భామను తీసుకునేందుకు చాలా మందే క్యూ కట్టారు. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్ అక్కినేని (Akhil Akkineni)తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ (Most Eligible Bacherlor) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా తన కోస్టార్ పూజాహెగ్డే గురించి అఖిల్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
పూజాహెగ్డే వర్క్‌హాలిక్. ఆమె ఒక సినిమా షూటింగ్ చూసుకుంటూనే మరో సినిమా షూటింగ్ కు హాజరవుతూ ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆరు సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాల షూటింగ్ కోసం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణిస్తూనే ఉంటుంది. పూజాహెగ్డే చాలా కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. నిజంగా ఆమెను ప్రశంసించాల్సిందే..అంటూ పూజాహెగ్డేను ఆకాశానికెత్తేశాడు అఖిల్. ఈ సినిమాలో పూజా పాత్ర గురించి చెప్పుకొస్తూ..స్టాండప్ కామెడీ అంశాన్ని పూజాహెగ్డే చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని చేసిందన్నాడు అఖిల్.
కామెడీ సన్నివేశాల్లో చాలా ప్యాషన్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేసిందని అఖిల్ చెప్పాడు. సెట్స్ లో పూజాహెగ్డే చాలా చురుకుగా ఉంటూ..తన చుట్టూ ఉన్న వారిలో ఎనర్జీ నింపుతూ తన పాత్రకు మనస్సు పెట్టి న్యాయం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?