Akhil Akkineni | కెరీర్లో ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కొట్టాలని తెగ ఎదురుచూస్తున్నాడు యువ హీరో అక్కినేని అఖిల్. గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపోవడంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్నారు అఖిల్. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లెనిన్(Lenin). ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నేడు అఖిల్ బర్త్‌డే సందర్భంగా మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
గతాన్ని తరమటానికి పోతా.. మా నాయిన నాకో మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటాది. ఈ పేరు ఎట్లా నిలబడాలి అంటే అంటూ పవర్‌ఫుల్‌గా సాగింది ఈ గ్లింప్స్. ఈ వీడియో చూస్తుంటే.. రూరల్ లవ్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.