most eligible bachelor first day collections | అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వాసు వర్మ, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నాడు. తొలి విజయం అందుకోవాలని కసితో ఉన్న అఖిల్‌కు ఈ కోరిక తీర్చేలా కనిపిస్తుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని భాస్కర్ ఈ సినిమాతో పర్లేదనిపించాడు. కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాసుల వర్షం బాగానే కురిసింది. తొలిరోజు ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు తీసుకొచ్చింది. ఇదే దూకుడు కొనసాగితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్‌కు మొదటి విజయంగా నిలవడం ఖాయం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 2.02 కోట్లు
సీడెడ్: 1.12 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.61 కోట్లు
ఈస్ట్: 0.52 కోట్లు
వెస్ట్: 0.31 కోట్లు
గుంటూరు: 0.52 కోట్లు
కృష్ణా: 0.32 కోట్లు
నెల్లూరు: 0.23 కోట్లు
ఏపీ + తెలంగాణ: 5.46 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.35 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 6.81 కోట్లు షేర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 12.2 కోట్లకు పైగానే వసూలు చేయాలి. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి పైగా సినిమాకు కూడా టాక్ బాగానే వచ్చింది కాబట్టి నిలబడుతుందని నమ్ముతున్నారు బయ్యర్లు. మహాసముద్రం సినిమాకు నెగిటివ్ టాక్ రావడం కూడా అఖిల్ సినిమాకు కలిసొస్తుంది. పెళ్లి సందడి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అఖిల్ అక్కినేని దసరాను క్యాష్ చేసుకుంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..
Dussehra Movies 2021 | ఈ మూడు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?
Box office |పెళ్లి సందD ముందు అంత భారీ లక్ష్యమా.. శ్రీకాంత్ తనయుడు తట్టుకుంటాడా..?
Aditi Rao Hydari | లెజెండరీ బయోపిక్‌లో నటించాలని ఉందట..|