సైరా చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్షన్లో వస్తున్న మూవీ ఏజెంట్ (Agent). యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే విడుదలైన టీజర్ స్టైలిష్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఏజెంట్ సంక్రాంతి కానుకగా విడుదల కానుందని వార్తలు వచ్చినా టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఫిబ్రవరి 2023లో విడుదలవుతుందని మరో వార్త కూడా హల్ చల్ చేస్తుండగా.. న్యూఇయర్ కానుకగా జనవరి 1న విడుదల తేదీని ప్రకటించనున్నారని టాలీవుడ్ సర్కిల్ టాక్. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్-సురేందర్ 2 సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఏజెంట్లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమర్షియల్ యాడ్స్ లో నటించిన సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్గా మెరవబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా స్టైలిష్ సిక్స్ ప్యాక్ బాడీ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు అఖిల్ అక్కినేని.
ఏజెంట్ టీజర్ ..
Read Also : Rashmika Mandanna | సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా స్కూటర్ రైడ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Sushant Singh Rajput | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే : రూప్‌కుమార్ షా
Read Also : Hari Hara Veera Mallu | హరిహరవీరమల్లుకు ఆర్ఆర్ఆర్ క్రేజ్ కలిసొచ్చేనా..?