అగ్ర నటుడు బాలకృష్ణ కెరీర్లో ‘అఖండ’ సినిమా ఓ అద్భుతం. కోవిడ్ కారణంగా వెలవెలబోతున్న సినిమా థియేటర్లకు మళ్లీ జనకళను తెచ్చిన సినిమా అది. అందుకే.. బాలకృష్ణకు అభిమానులున్నట్టే.. ‘అఖండ’ సినిమాకు కూడా ప్రత్యేకంగా అభిమానులున్నారు. వచ్చే నెల 25న ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2 -తాండవం’ రానుంది.
ఈ సినిమాపై అంచనాలు సాధారణంగా లేవ్. రీసెంట్గా విడుదలైన టీజర్ కూడా రికార్డు స్థాయి వ్యూస్‌ని సాధించింది. ‘అఖండ 2’ గురించి ఎలాంటి అప్డేట్ విడుదలైనా.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. ‘అఖండ 2’ ప్రభావం ఆడియన్స్‌లో అలా ఉంది. తాజా ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం వెలుగు చూసింది.
‘అఖండ’ సినిమా విజయానికి ప్రధాన కారణం అమ్మ సెంటిమెంట్. దాన్ని సీక్వెల్లో మరింత గొప్పగా ఆవిష్కరించనున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వచ్చినట్టు చిత్రయూనిట్ చెబుతున్నది. వీటితోపాటు యాక్షన్ సీన్స్ కూడా ‘అఖండ’ను మించే ఉంటాయట.
ఇక అఖండ సికిందర్ అఘోరీగా ఇందులో బాలకృష్ణ మరోసారి నట విశ్వరూపం చూపించనున్నారని, ‘అఖండ’ను మించి అత్యంత శక్తిమంతంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుందని, సాక్షాత్ శివుడ్నే ఆ పాత్రలో జనం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది, పగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందిస్తున్న విషయం విదితమే.