Akhanda 2 | నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam) అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ నుంచి ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి తాండవం సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.