Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అఖండ 2’. అఖండ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం తర్వాత, దాని సీక్వెల్ ‘అఖండ 2’ (అఖండ 2 – తాండవం) పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇటీవలే జార్జియాలో కూడా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను జూన్ 09న సాయంత్రం 06.03 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 – The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/inJj6C7DA6— Suresh Kondeti (@santoshamsuresh) June 8, 2025