Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అఖండ2. తొలి పార్ట్ సూపర్ హిట్ సాధించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు బాలయ్య బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. బాలయ్య తనదైన శైలిలో డైలాగ్స్‌తో అదరగొట్టారు. ‘నా శివుడి అనుమతి లేనిదే.. ఆ యముడు కన్నేత్తి చూడడు.. నువ్వు చూస్తావా..’ అంటూ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.
ఇక తమన్ ఎప్పటి మాదిరిగానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేశారు.. మొత్తంగా టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఈ టీజర్‌తో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. డైరెక్టర్ బోయపాటి మార్క్ కనిపించేలా బాలయ్య ‘అఖండ రుద్ర తాండవం’ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘శంభో’ అంటూ హిమాలయాల బ్యాక్ గ్రౌండ్‌తో టీజర్ ప్రారంభం కాగా.. సింహం శివుడి రూపంలో ఉందా అన్నట్లుగా బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. గతంలో ఎప్పుడు కనిపించని విధంగా బాలయ్య కనిపించే సరికి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోతుంది. త్రిశూలం చేతబట్టి, ఒళ్లంతా విబూదితో జటాజూటధారియై.. ధర్మాన్ని కాపాడేందుకు సాక్షాత్తూ పరమశివుడే సింహం రూపంలో వస్తున్నాడా అన్నట్టుగా బాలయ్యని పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు బోయపాటి.
అభిమానుల అంచనాలని ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పించేలా బాలయ్యను చూపించారు బోయపాటి. వేదం చదివిన శరభం యుద్ధానికి ఎదిగింది అంటూ సాగే డైలాగ్ మూవీపై హైప్ పెంచింది. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే నట సింహం బాలయ్య బర్ డే సందర్భంగా విడుదలైన టీజర్ నెట్టింట హల్చల్ చేస్తుంది.