Akhanda 2 Team : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రాన్నిఅఖండ-2 తాండవం (Akhanda 2) చిత్ర యూనిట్ దర్శించుకుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu), సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్(SS Thaman) బృందం గురువారం దర్శించుకుంది. ఈ సందర్భంగా చిత్ర వీరికి రాజగోపురం వద్ద ఆలయం మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బోయపాటి, థమన్లు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అమ్మవారి వేద ఆశీర్వచనం మండపం నందు అఖండ 2 యూనిట్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనం తెలిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలను ఆలయ అధికారులు బోయపాటి, తమన్ బృందానికి అందించారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఆలయ ప్రాగణంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు.

‘విఘ్నాలన్ని తొలగిపోయి అఖండ 2 తాండవం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చాం. ఆలయ ఆర్చకుల దీవెనలతో స్వామి దర్శనం చేసుకున్నాం. బాలయ్య ఉగ్రరూపాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులు అండఖ 2 సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని బోయపాటి తెలిపారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ 2 తాండవం చిత్రం వారం ఆలస్యంగా.. డిసెంబర్ 12న థియేటర్లోకి వస్తున్న విషయం తెలిసిందే.