Akhanda 2 | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కలయికలో వస్తోన్న ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ విడుదలైన అన్ని భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. టీజర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
కాగా దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే వార్తను అందించారు. అక్టోబర్ 24న సాయంత్రం 4 :54 గంటలకు ప్రమోషనల్ అప్డేట్ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే అఖండ 2 ఫస్ట్ సింగిల్ అయి ఉంటుందని అభిమానులు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు.
రీసెంట్గా మ్యూజిక్డైరెక్టర్ థమన్ స్టూడియోలో పండిత్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. సౌండ్ ట్రాక్‌లో భాగంగా వచ్చే సంస్కృత శ్లోకాలు ఆలపించేందుకు ఈ ఇద్దరు పండితులను థమన్ టీం తీసుకొచ్చిందట. అఖండ ఫస్ట్ పార్ట్‌లో బీజీఎం ఏ రేంజ్లో సినిమాకు హైలెట్‌గా నిలిచిందో తెలిసిందే.
ఇక సీక్వెల్లో అంతకుమించిన స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని ఇప్పటివరకు థమన్ షేర్ చేసిన అప్డేట్స్ చెబుతున్నాయి. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
24th October at 4.54 PM…
Get ready for a BLASTING ROAR 🔥🔥#Akhanda2Thaandavam #Akhanda2 pic.twitter.com/fjJV1FUNzs— 14 Reels Plus (@14ReelsPlus) October 20, 2025