Akhanda 2 | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల ముందు చిత్ర బృందం మీడియాతో మాట్లాడగా, ఆ సమయంలో హీరోయిన్ సంయుక్త మీనన్ తన పాత్ర, షూటింగ్ అనుభవాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను చాలా బిజీగా ఉన్నప్పటికీ మంచి అవకాశం రావడంతో డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఈ చిత్రంలో భాగమయ్యాను అని సంయుక్త చెప్పారు. “అఖండ 2 కథలో కీలక మలుపు తిప్పే పాత్ర నాకు వచ్చింది. సినిమా అంచనాలకు మించి ఉండబోతోంది. గూస్బంప్స్ పక్కా!” అని ధీమాగా చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను గ్రేట్ విజన్‌తో పనిచేస్తారని, సినిమాటిక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని సంయుక్త వెల్లడించారు.
ఈ సినిమాలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా, ముఖ్యంగా ప్రెజెంటేషన్ విషయంలో కొత్తగా ఉంటుందని అన్నారు. తన కెరీర్లో తొలిసారి మాస్ సాంగ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆమె, “మాస్ సాంగ్ చేసే సమయంలో మోకాలు దెబ్బతింది. షూట్‌ను ఆపకుండా పిజియోథెరపీ చేస్తూ డ్యాన్స్ పూర్తి చేశాను” అని చెప్పారు.ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, ఆయన సెట్లో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, దర్శకుల విషయంలో పరిపూర్ణ నటుడిగా కనిపిస్తారని సంయుక్త అన్నారు. “డాకూ మహరాజ్ నా ఫేవరెట్ సినిమా” అని కూడా పేర్కొన్నారు. తమన్ అందించిన సంగీతం, ప్రత్యేకంగా సంస్కృత శ్లోకాలతో కూడిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినిపించే ప్రతి సన్నివేశాన్ని ఇంకా హైలైట్ చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
నిర్మాతలు రామ్, గోపి ఆచంట మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తున్నారని సంయుక్త తెలిపారు. ప్రస్తుతం తాను ‘స్వయంచు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నట్లు సంయుక్త తెలిపారు