Akhanda 2 | నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ అక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’ నుంచి రిలీజ్ టీజర్ బయటకు రాగా, ఇప్పుడు ఇది ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. త్రిశూలం పట్టిన శివుడిలా, గదను ధరించిన హనుమంతుడిలా బాలకృష్ణ ఆవిష్కరించిన యాక్షన్ సీక్వెన్సులు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఎదురైన సమస్యల నేపథ్యంలో, దర్శకుడు బోయపాటి శ్రీను టీజర్లో సింబాలిక్‌గా దిష్టి తీసే షాట్‌ను చేర్చడం విశేషం.రిలీజ్ టీజర్లో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించి చెప్పిన “లోక క్షేమం కోరాం… ఇక నుంచి మేం ఆ శివుని ఆధీనం” అనే డైలాగ్ చెబుతాడు. అదే సమయంలో హర్షాలీ మల్హోత్రాను దుండగులు వెంటాడుతున్న సన్నివేశాలు చూపించడం థ్రిల్లింగ్‌గా మారింది. తర్వాత శివలింగాన్ని చూపించడం, దుష్ట శక్తిగా ఆది పినిశెట్టి ప్రవేశం… విజువల్స్‌కు సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హద్దులు దాటి పూనకాలు తెప్పించేలా ఉంది.
“కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు… త్రిశూలం పట్టుకున్న ఆ దేవుడిని చూడు… ఎవడ్రా విభూతి కొండను ఆపేది” అనే డైలాగ్ వినిపిస్తున్న క్షణంలో బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విలన్ గ్యాంగ్‌లో ఒకరిని పైకి ఎత్తి హర్షాలీకి దిష్టి తీసే షాట్ టీజర్లో హైలైట్‌గా నిలిచింది. గద-త్రిశూలాలతో బాలకృష్ణ చేసిన ఫైట్స్ దేవతల అవతారాలు దిగి వచ్చినట్టుగా కనిపించేలా రూపొందించారని అభిమానులు అంటున్నారు. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2 తాండవం’ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట రామ్–గోపి నిర్మించారు.
ఇందులో సంయుక్త ప్రధాన నాయికగా కనిపిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే వేగంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. టీజర్‌తో మాస్ ఫ్యాన్స్‌లో హైప్ రెట్టింపైంది. ఇక డిసెంబర్ 12న విడుదల కానున్న ‘అఖండ 2’ కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.