‘సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలీదు కొడకా.. ఊహకు కూడా అందదూ…’ శుక్రవారం విడుదలైన ‘అఖండ2 : తాండవం’ గ్లింప్స్‌లో బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఈ గ్లింప్స్ మొదలవ్వడమే యాక్షన్ మోడ్‌లో మొదలైంది. వందలాది రౌడీల మధ్య ఒక్కడే బాలయ్య నిలబడి ఉన్నాడు.. అందర్నీ ఒక్కడే ఒంటిచేత్తో మట్టికరిపిస్తున్నాడు. కట్ చేస్తే.. ఆ గూండా నాయకుడికి వార్నింగ్ ఇస్తూ పై డైలాగ్‌ని తనదైన ైస్టెల్లో ఎమోషనల్‌గా చెప్పేశారు బాలకృష్ణ. వార్నింగ్ ఇస్తుండగా.. వెనుక నుంచి గుర్రాలతో అటాక్ చేయబోగా.. సడెన్‌గా వెనక్కి తిరిగారు బాలయ్య.. అంతే.. గుర్రాలు బెదిరిపోయాయి.. అడుగడుగునా బోయపాటి శ్రీను మేకింగ్ ైస్టెల్ కొట్టొచ్చినట్టు ఈ గ్లింప్స్‌లో కనిపించింది.
బాలకృష్ణ వ్యక్తిత్వానికీ, ప్రవర్తనకూ అద్దంపట్టేలా డైలాగులు రాయడం డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రత్యేకత. ఈ గ్లింప్స్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ అలాగే ఉంది. ఇక తమన్ అయితే.. ఆర్.ఆర్.తో చెలరేగిపోయారు. ఏదేమైనా సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఈ గ్లింప్స్‌ని రూపొందించారు. మరో విశేషమేంటంటే.. ఈ గ్లింప్స్‌లో బాలయ్య కనిపించింది ‘అఖండ సికిందర్ అఘోరా’గా కాదు. సివిల్‌లో కనిపించారు. ఈ కొత్త గెటప్‌ని కూడా ఫ్యాన్స్‌కి నచ్చేలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు బోయపాటి. ఇందులో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఈ గ్లింప్స్ చెప్పేసింది. ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానున్నది. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి.