MowgliOnDec13 | కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్, యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘మౌగ్లీ’ (Mowgli). తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవానికి, ‘మౌగ్లీ’ చిత్రాన్ని డిసెంబర్ 12 న విడుదల చేయాలని మేకర్స్ తొలుత నిర్ణయించారు. అయితే, అదే రోజున నటసింహం నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ 2’ విడుదల ఉన్న నేపథ్యంలో, థియేటర్ల లభ్యత, కలెక్షన్స్ను దృష్టిలో ఉంచుకుని ‘మౌగ్లీ’ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో,రోషన్ కనకాల ‘మౌగ్లీ’ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 13న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన రోషన్, ‘మౌగ్లీ’ చిత్రంతో తన కెరీర్లో మరో మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు.
The “LION” roars, and #Mowgli steps back to welcome the Jungle King 🦁#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE on 13th DEC 2025 ❤️🔥
Premieres from DEC 12th 💥
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala @SakkshiM09 & @publicstar_bsk@vishwaprasadtg… pic.twitter.com/egKiG2Cv5E
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2025