Thegimpu Movie Trailer | ఇప్పటికే సంక్రాంతి పోరు జోరందుకుంది. ఓ వైపు వారసుడు, మరోవైపు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలు పోటా పోటీగా సంక్రాంతి వేటకు సిద్ధమయ్యాయి. ఇక ఈ పోరులో అజిత్ తెగింపు చేరింది. కేవలం పోస్టర్లతోనే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. గ్యాంగ్‌స్టర్‌గా అజిత్ నెరిసిన జుట్టు, గడ్డం లుక్‌లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూ ఇయర్ కానుకగా రిలీజైన తమిళ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. కాగా తాజాగా చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
అజిత్ తన గ్యాంగ్‌తో కలిసి ఓ బ్యాంకులోకి చోరబడి బ్యాంకును తన కంట్రోల్లోకి తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఆ పై డిమాండ్స్ చేయడం కనిపిస్తుంది. మరి ఆ డిమాండ్స్‌కు పోలీసులు అంగీకరించారా అసలు అజిత్ బ్యాంక్‌లోకి ఎందుకు చోరబడ్డాడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ట్రైలర్లోనే యాక్షన్ సీన్లు ఈ రేంజ్లో ఉంటే సినిమాలో ఇంకే రేంజ్లో ఉంటాయో అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అజిత్ చేసే యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అజిత్‌తో పాటు ప్రియా వారియర్ కూడా యాక్షన్ ఇరగదీసినట్లు తెలుస్తుంది.
ట్రైలర్‌ను గమినిస్తే బ్యాంక్ చుట్టూనే సినిమా జరుగనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కువ భాగం షూటింగ్ కూడా బ్యాంక్‌లోనే చేసినట్లు కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇందులో మరో విశేషమేంటంటే వారసుడు సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది.