Thunivu Movie Break even Completed | నువ్వా నేనా అనే పోరులో అజిత్ మొదటి విజేతగా నిలిచాడు. అజిత్ హీరోగా నటించిన ‘తునివు’ తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ ఏడాది మొదటి కోలీవుడ్ హిట్‌గా నిలిచింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. దాంతో ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్లో వచ్చాయి. పోటీగా తనకంటే అధిక మార్కెట్ ఉన్న విజయ్ ఉన్నా.. ఆయన కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.88 కోట్ల షేర్‌ను సాధించి ఏడాది మొదటి హిట్టుగా పేరు లిఖించుకుంది. తెలుగులో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. అజిత్ గత సినిమాలతో పోల్చితే తునివు సినిమాకు తెలుగులో ఎక్కువే బిజినెస్ జరిగింది. దాదాపు మూడు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రెండు కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో కోటి లాగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థుతుల్లో అది అసాధ్యమే అని అనిపిస్తుంది. ఎందుకుంటే ఈ సినిమాకు పోటీగా మూడు సినిమాలున్నాయి. అవీ చాలవన్నట్టు తునివు సినిమాకు పట్టుమని వంద థియేటర్లు కూడా లేవు. దాంతో తెలుగులో దాదాపు ఈ సినిమా రన్ ముగిసినట్లే. అయితే ఓరల్‌గా మాత్రం ఈ సినిమా ఫ్రాఫిట్ జోన్లోకి వెళ్లిపోయింది.