VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా (VidaaMuyarchi). ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్ ఎయిర్‌పోర్టులో త్రిష, అజిత్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కనిపించిన విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అధికారిక అప్డేట్ వచ్చింది. నేడు Azerbaijan దేశంలో షూటింగ్ షురూ అయింది. ఈ చిత్రానికి అజిత్ మొత్తం 110 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని సమాచారం. కాగా ఈ షెడ్యూల్ తర్వాత చెన్నైలో జరుగనున్న షూటింగ్లో పాల్గొననున్నాడు. షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న స్టిల్ ఒకటి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. అప్డేట్ అందించింది త్రిష. నాన్‌స్టాప్‌గా తాజా షెడ్యూల్ కొనసాగనున్నట్టు సమాచారం.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సాధారణంగా మగిజ్ తిరుమేని సినిమాను ఆలస్యం కాకుండా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తుంటాడని తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఈ ఏడాది తునివు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించాడు అజిత్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
షూటింగ్ అప్డేట్..
Just IN: Ajith Kumar’s #VidaaMuyarchi shoot has begun in Azerbaijan.
#AjithKumar has given 110 days of call sheet for the film.After completing the… pic.twitter.com/Cr8YaueCRg
— Manobala Vijayabalan (@ManobalaV) October 4, 2023
Actress @trishtrashers Latest Insta Story
She is Continuously posting Stories for the past Two Days #VidaaMuyarchi Game On 😍
Vidaamuyarchi shooting starts from Today 🥳#AjithKumar pic.twitter.com/3ohEuaPdvT
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) October 4, 2023
ఎయిర్‌పోర్ట్‌లో ఇలా..
#VidaaMuyarchi team along with #Ajithkumar landed in Azerbaijan today✈️
Shooting to happen starting from tomorrow onwards 🎬
Team is planned to shoot for nonstop 3 months 👌MagizhThirumeni usually executes everything in planned schedule & so expecting the movie to be released… pic.twitter.com/McpxEbN0ZT
— AmuthaBharathi (@CinemaWithAB) October 3, 2023
#AK #AjithKumar‘s #Vidaamuyarchi shooting from Tomorrowpic.twitter.com/QlrfgLI2hu
— Prakash Mahadevan (@PrakashMahadev) October 3, 2023
Trisha spotted at Dubai Airport 💥#VidaaMuyarchi#AjithKumarpic.twitter.com/DSDW2euTHv
— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) October 3, 2023