AK 63 | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) ప్రస్తుతం ఏకే 62 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మగిజ్ తిరుమేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి VidaaMuyarchi టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవలే షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. అజిత్ కుమార్ టీం అజర్బైజాన్లో ల్యాండింగ్ కాగా.. నాన్‌స్టాప్‌గా 3 నెలలపాటు షూటింగ్ కొనసాగించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే అజిత్ కొత్త సినిమా ఏకే 63 (AK 63)పై ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు AK 64 సినిమాను విడుదలై ఫేం వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోతున్నాడట. అంతేకాదు ఈ రెండు సినిమాలను తెరకెక్కించేలా RS infotainment ఒప్పందం కుదుర్చుకుందని జోరుగా టాక్ నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టులపై ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానుగుణంగా ఇద్దరు హీరోయిన్లున్నారని వార్తలు రాగా.. మరో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.మగిజ్ తిరుమేని సినిమాలంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో 2024 వేసవి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.