valimai movie business | తమిళ స్టార్ హీరో అజిత్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధిస్తుంటాయి. ప్రస్తుతం అజిత్ నటించిన ‘వాలిమై’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రముఖ టాలీవుడ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి. మహాశివరాత్రి కానుకగా ఒకరోజు ముందే ఫిబ్రవరి 24న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి తెలుగులో భారీగా బిజినెస్ జరిగిందని సమాచారం.
హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమిళంలో 72 కోట్ల బిజినెస్ జరుగగా తెలుగులో 4కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. అజిత్ గత చిత్రం విశ్వాసం రెండున్నర కోట్ల బిజినెస్ జరుగగా వాలిమై చిత్రానికి కోటిన్నర పెరిగింది. ఈ చిత్రం బ్రేక్ఈవెన్ కావాలంటే 4.5 కోట్ల వరకు షేర్‌ను సాధించాల్సి ఉంటుంది. పోటిగా శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ తో పాటు వరుణ్‌తేజ్ ‘గని’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ చిత్రాలు ఫిబ్రవరి 25న విడుదల కానున్నాయి.