Ajith Pattudala | తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ఒక బ్లాక్ బస్టర్ కొట్టి చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో మంకత్తా (గ్యాంబ్లర్), ఆరంభం, వేదలం చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత వరుసగా పరజయాలను చవిచూశాడు. ఇంకొన్ని రోజులు అయితే సినిమాలు వదిలేసి ఫుల్ టైం రేసర్‌గా కూడా మారబోతున్నాడు అజిత్. ఈ క్రమంలోనే తన చివరి చిత్రాలు అయిన ప్రేక్షకులను అలరిస్తాయి అనుకుంటే అవికూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి.
అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విడాముయర్చి (తెలుగులో పట్టుదల). ఈ సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష, అర్జున్ సర్జా, రెజీనా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి నీరసంగా బయటికి రావడం వంటి వీడియోలు వైరల్‌గా మారాయి. అజిత్ పట్టుదలలో పట్టు లేదా.. సినిమాలపై అజిత్ ‘పట్టుదల’ కోల్పోయాడా అంటూ సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రంపై ట్రోలింగ్ జరుగుతుంది.
అయితే ఈ సినిమా యావరేజ్‌గా ఉన్న విడుదల తేదీని మార్చడం వలన మూవీ పెద్ద ఎఫెక్ట్ పడిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే మొదటి సంక్రాంతి సమయంలో ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ అనుకొని కారణాల వలన అప్పుడు వాయిదా పడింది. ఒకవేళ అప్పుడే ఈ సినిమాను విడుదల చేసి ఉంటే కనీసం పొంగల్ సెలవులు కలిసివచ్చి కలెక్షన్లు అన్న పెరిగి ఉండేవి. ఇప్పుడు ఫిబ్రవరి లాంటి డ్రై సీజన్లో విడుదల చేయడంతో కనీసం బడ్జెట్ కలెక్షన్లు తీసుకువస్తుందా అని నిర్మాతలు భావిస్తున్నారు.