ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి సందడి గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. నువ్వా నేనా అనే రీతిలో బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలు తలపడ్డారు. ఇక్కడ ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్యల’కు ఎలాంటి పోటీ ఉందో.. తమిళంలో ‘వారిసు’, ‘తునివు’ సినిమాలకు కూడా అదే స్థాయిలో పోటీ ఏర్పడింది. దాదాపు 8ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు అరవ హీరోలు ఒకే సారి తలపడటంతో తమిళ బాక్సాఫీస్ వేడెక్కింది. ఈ సంక్రాంతికి ఎవరు పైచేయి సాధిస్తారో అని ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
కాగా తాజాగా ఈ ఇద్దరి డే1 కలెక్షన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి అజిత్ పైచేయి సాధించినట్లు తెలుస్తుంది. ఓపెనింగ్స్‌లో విజయ్ సినిమాను అజిత్ దాదాపు నాలుగైదు కోట్ల మార్జిన్‌తో కొట్టినట్లు సమాచారం. ఇక గత ఐదారేళ్ల నుండి విజయ్ సినిమాలు టాక్‌తో సంబంధంలేకుండా 50 నుండి 60 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధిస్తూ వస్తున్నాడు. అందులో ఓపెనింగ్ డే రోజునే దాదాపు 50కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేస్తున్నాయి. అలాంటిది ఈ సంక్రాంతికి కేవలం రూ.40 కోట్ల గ్రాస్తోనే సరిపెట్టుకున్నాడు.
అయితే ఒకే రోజున రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజవడం ఇద్దరి ఓపెనింగ్స్‌పై దెబ్బపడుతుంది. అజిత్ కూడా కేవలం విజయ్‌పై నెగ్గాడు కానీ తన రేంజ్ ఓపెనింగ్స్ మాత్రం సాధించలేకపోయాడు. పైగా తమిళనాడులో థియేటర్ల సంఖ్య మనకంటే చాలా తక్కువ. మన దగ్గర రెండు పెద్ద సినిమాలు రిలీజైన పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ దక్కుతాయి. ఎందుకంటే మన దగ్గర థియేటర్ కౌంట్ చాలా ఎక్కువ. ఇక ఇక్కడ వీరసింహుడికి వాల్తేరుకు మధ్య కూడా మంచి పోటీయే ఉంది. నిన్న రిలీజైన వీరసింహుడు మంచి టాక్‌నే తెచ్చుకున్నాడు. మరీ వాల్తేరు ఏం చేస్తాడో చూడాలి.