Ajith Kumar Car Crash | తమిళ నటుడు అజిత్ మరోసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురి కాగా.. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అజిత్.
అజిత్ కుమార్ ఇటీవల స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేస్‌లో పాల్గొన్నాడు. ఈ రేస్ సమయంలో, ఆయన నడిపిన కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టడంతో గాల్లో రెండు పల్టీలు కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ, అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు, ఆయనకు తీవ్రమైన గాయాలు ఏమీ కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కారు నుంచి క్షేమంగా దిగినట్లు వీడియోలలో కనిపించింది, దీంతో అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Scary moment 🙄🙄😳😳#AjithKumarracing #GoodBadUgly #AjithKumar #ajithkumarracing pic.twitter.com/HEUkK9Vnsp
— cinepics (@cinepiccollx) February 22, 2025
AK Is All Right | Ajith Kumar#AjithKumar | #AjithkumarRacing | #Cineulagam | #GoodBadUgly pic.twitter.com/9P8Blqlelr
— Cineulagam (@cineulagam) February 22, 2025
రేసింగ్ అంటే అజిత్‌కు మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అజిత్ కార్ రేసింగ్ అనే ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ టీం మూడో స్థానం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రేస్‌కి ముందు కూడా అజిత్ కారు ప్రమాదానికి గురయ్యింది.