Ajith Kumar | తళా అజిత్ కుమార్ .. ఈ పేరు వినగానేనే డేర్, గట్స్, అడ్వెంచర్ అనే మాటలు గుర్తొస్తాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అంటే అతడే. దళపతి విజయ్‌తో సమానంగా పోటీపడగల స్టామినా, స్టైల్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఆయన సొంతం. అతడి సినీ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అతడి వ్యక్తిత్వం కూడా అంతే అద్భుతం. దశాబ్ధాల పాటు తమిళ సినిమాను శాసిస్తున్న అజిత్, ఇప్పుడు కూడా తన స్పీడ్‌తో యువ హీరోలకే పోటీగా నిలుస్తున్నారు. సినిమాల్లో హీరోగా, నిజ జీవితంలో స్పోర్ట్స్ మేన్‌గా అజిత్ అదరగొడుతున్నాడు.
అతడి వ్యక్తిత్వంలో ఆకట్టుకునేది వినమ్రత. అభిమానులు తళా అని ప్రేమగా పిలుస్తుంటే , నన్ను అజిత్ అని పిలవండి అని ప్రతిసారి కూడా అభిమానులని కోరుతున్నారు. “స్టార్స్ కోసం అభిమానులు త్యాగాలు చేయకండి” అనే సందేశాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు అందరి మనసులని గెలుచుకుంటారు. ఇక తల డేరింగ్ అండ్ డాషింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 54 ఏళ్ల వయస్సులో కూడా ఫార్ములా వన్ రేస్ కార్‌ను 250-300 కి.మీ/గం స్పీడుతో నడిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల వరుసగా రేసింగ్ పోటీల్లో పాల్గొని తన టీమ్‌ను గెలిపించడమే కాదు, తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.
తాజాగా అజిత్ రోడ్డుపై 250 కి.మీ వేగంతో దూసుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. “ఈ వయసులో ఈ స్పీడేంటి తళా?” అని అభిమానులు ఆశ్చర్యపోతున్నా, ఆయనకు మాత్రం భయం లేదు! రేసింగ్ అంటే అతడి ప్యాషన్. యాక్సిడెంట్లు, రిస్క్ – ఇవన్నీ అతన్నీ ఆపలేవు. అయితే అభిమానుల కోరికేంటంటే.. సినిమాల్లో కూడా ఇంతే స్పీడ్ కావాలి! ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తళా నుంచి రావాలని కోరుకుంటున్నారు. ఎలా చూసుకున్నా, అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తళా అంటే ఒక స్పీడ్, తళా అంటే ఓ స్టైల్, తళా అంటే ఓ సింప్లిసిటీ. మాస్కు, క్లాస్‌కు మధ్య ఉండే బ్రిడ్జ్ అజిత్ కుమార్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#Ajithkumar Car Speed 250 km/hr😟😟 pic.twitter.com/i6yz7R9Dlz
— India Brains (@indiabrains) August 23, 2025