Ajith kumar | తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లుక్‌లో అజిత్ మరింత స్టైలిష్‌గా, యువకుడిగా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అజిత్ కుమార్ మళ్లీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తోనే ఇంకో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసమే అజిత్ జుట్టు కత్తిరించి షార్ట్ హెయిర్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
AK at Spa Francochamps circuit, Belgium preparing for the 3rd round of GT4 European series coming weekend#ajithkumar #ajithkumarracing #akracing #GT4 #europeanseries #weekendracing #racing pic.twitter.com/nXksEJZUdc
— Ajithkumar Racing (@Akracingoffl) June 24, 2025