Ajith Kumar retirement rumours | తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమాల నుంచి ఆయన తప్పుకోనున్నారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ, ఈ ఏడాది నవంబర్ నెలలో తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కొద్ది రోజులుగా అజిత్ కుమార్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఆ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏకే 64గా రానున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్‌లో ప్రారంభంకానున్నట్లు సమాచారం.
మరోవైపు తనకు రేసింగ్, సినిమాలు రెండు ఇష్టమేనని.. కానీ రెండు ఒకేసారి చేయడం వలన రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా తాను, రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.