తమిళ సినీ పరిశ్రమలో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్, ఆయన భార్య శాలినిలకు సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చెన్నైలోని ‘ఎఫ్‌సీ మద్రాస్’ ఫుట్‌బాల్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ దంపతులు సందడి చేశారు. ఈ సందర్భంగా అజిత్ కుమార్ తన సిగ్నేచర్ వంటకమైన బిర్యానీని స్వయంగా తయారు చేస్తుండగా, భార్య శాలిని ఆయనను ఆటపట్టించడం అందరినీ ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో అజిత్ కుమార్ ఒక పెద్ద పాత్రలో బిర్యానీ కోసం మాంసాన్ని మ్యారినేట్ చేస్తూ కనిపిస్తుండగా. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన శాలిని ఒక సూపర్వైజర్లా ఫోజులిస్తూ.. “నేను చెప్పినట్టే చేస్తున్నావా లేదా?” అంటూ అజిత్‌ను సరదాగా ప్రశ్నించింది. శాలిని వేసిన ఈ చమత్కారానికి అజిత్‌తో పాటు అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత బిర్యానీ పనిలో బిజీగా ఉన్న అజిత్‌ను శాలిని పిలిచి, తనతో కలిసి సెల్ఫీ దిగాలని కోరడం, ఆయన నవ్వుతూ కెమెరా వైపు చూడటం అభిమానుల మనసులను గెలుచుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
ఇక సినిమాల విషయానికి వస్తే, దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ కుమార్ చేయాల్సిన తదుపరి చిత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీనితో పాటు అజిత్ కుమార్ ఈ ఏడాది జరిగే వివిధ మోటార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో కూడా చురుగ్గా పాల్గొననున్నారు.
Shalini mam – naa sona Mari paniyacha 😁
Ajith enga paru 🤩 Pookie couples 😁#AjithKumar #ShaliniAjithKumar #AK pic.twitter.com/G95wNgI9tS
— AJITH FANS COMMUNITY (@TFC_mass) March 30, 2026