Ajith Kumar | తమిళ స్టార్ నటుడు అజిత్ కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న అజిత్ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అజిత్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఘన స్వాగతం పలికి, వారికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే దర్శనంకి ముందు అజిత్ గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా.. భక్తులు అతడిని చూసి తల (Thala) తల (అజిత్‌ని తమిళంలో అభిమానంతో పిలిచే పేరు) పిలుస్తుండగా.. ఆలయ ప్రాంగణం కావడంతో అజిత్ వెంటనే భక్తులను ఉద్దేశించి సైగ చేశారు. ఇది కోవిల్ (దేవుడి సన్నిధి) అని అలా అనకుడదు నిశ్శబ్దంగా ఉండాలని భక్తలను కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో హిట్ అందుకున్న అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్‌పైనే పూర్తి దృష్టిని పెట్టాడు.
தல தல என கத்திய ரசிகர்கள்… சைகை மூலம் சைலண்டாக்கிய அஜித்… திருப்பதி கோயிலில் சாமி தரிசனம் செய்த பின்னர் ரசிகரின் செல்போனை வாங்கி செல்ஃபி எடுத்து கொடுத்த அஜித்#Tirupati | #Temple | #Ajithkumar | #Worship | #PolimerNews pic.twitter.com/lBxseSPddg
— Polimer News (@polimernews) October 28, 2025