Ajith | ఇటీవలి కాలంలో అభిమానం హద్దులు దాటుతుంది. తమ హీరో కోసం అభిమానులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక సినిమాల రిలీజ్ సమయంలో అయితే పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేసి అందరి దృష్టి పడేలా చేస్తారు. తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రంతో అభిమానుల్ని పలకరించబోతోన్నాడు. ఇప్పటికే ట్రైలర్ ఐ ఫీస్ట్‌లా ఉంది. తలా అభిమానుల్ని మెప్పించేలా ఈ ట్రైలర్‌ను కట్ చేయగా, మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ను ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. అర్జున్ దాస్, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే నెల్లైలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ సినిమా కోసం 285 అడుగుల ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేసింది. అయితే అది కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ కటౌట్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై తలా యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. జి.వి. త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంతో అజిత్ మంచి హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు. అయితే 2019లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. అజిత్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న సమయంలో కటౌట్ కూలిపోవడంతో ఐదుగురు గాయపడ్డారు. కటౌట్ మీదకు 12 మందికి పైగా ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే అజిత్ తన అభిమానులను సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పనులు చేయోద్దని రిక్వెస్ట్ చేస్తుంటాడు.కాని ఫ్యాన్స్ మాత్రం అజిత్‌పై ఉన్న ప్రేమతో ఇలాంటి పనులు చేసి ఇబ్బందులు పడుతూనే ఉంటారు.
Take care Guys..#GoodBadUgly #AjithKumar pic.twitter.com/8iP9y46AEi
— Fukkard (@Fukkard) April 6, 2025