UP CM Yogi | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ (Ajey: The Untold Story of a Yogi) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. యోగి పాత్రలో బాలీవుడ్ నటుడు అనంత్ జోషి యోగి కనిపించబోతున్నాడు. పరేష్ రావాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత శాంతను గుప్తా రాసిన ‘ది మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్’ (The Monk Who Became Chief Minister) అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగష్టు 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తుంటే.. ఉత్తరాఖండ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన యోగి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎలా ఎదిగారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మేకర్స్.