నటుడు అజయ్.. టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. చాలా సినిమాలలో విలన్ పాత్ర పోషించిన ఆయన కొన్ని సినిమాలలో ఫ్రెండ్ పాత్ర పోషించాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు,ఛత్రపతి ఇలా చాలా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన అజయ్ అప్పట్లో ఎక్కువగా రాజమౌళి సినిమాలలో కనిపించేవారు.
19 ఏళ్లు అప్పుడు తాను తన ఫ్రెండ్ కలిసి ఇంట్లో డబ్బులు తీసుకుని నేపాల్ పారిపోయి.. అక్కడ రెండు మూడు నెలలు ఉండి.. తిరిగి రావడానికి డబ్బులు లేక ఓ హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చారని, జీవితంలో ఇలాంటి చాలా తప్పులు చేసానంటూ అజయ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
శ్వేత అనే అమ్మాయిని ప్రేమించిన సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న అజయ్. . ఆ తరువాత ఇంట్లో వాళ్లని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అజయ్ తన భార్యతో బయట కనిపించడం చాలా అరుదు. తాజాగా అజయ్, శ్వేత ఇద్దరు ఫొటోలకు ఫోజులివ్వగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.