బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం భోళా (Bholaa). కార్తీ టైటిల్ రోల్ పోషించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి హిందీ రీమేక్‌గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా మేకర్స్ ఇపుడు టీజర్ 2 లాంఛ్ చేశారు.
ఖైదీని మించిన హైటెక్నికల్ విజువల్స్ తో భోళా ఉండబోతుందని తాజా టీజర్ తో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న భోళా 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
భోళా టీజర్ 2..
ఈ చిత్రాన్ని అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా.
భోళా టీజర్..