‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అజయ్‌భూపతి. ఆయన రూపొందిస్తున్న తాజా ప్రయోగాత్మక చిత్రం ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై స్వాతి గునుపాటి, సురేష్‌వర్మ, అజయ్‌భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్నది. మంగళవారం టైటిల్‌ను వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అజయ్‌భూపతి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు దేశంలో ఎవరూ ప్రయత్నించనటువంటి సరికొత్త కాన్సెప్ట్ ఇది.
‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇందులో ముప్పై పాత్రలుంటాయి. ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించాం. నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి.