Ajay Arasada | ‘ఏడేళ్లపాటు షార్ట్‌ఫిల్మ్స్‌కు మ్యూజిక్ అందించాను. ‘జగన్నాటకం’ సినిమాతో సంగీత దర్శకుడిగా నా తొలి అడుగు పడింది. ‘ఆయ్’తో బ్రేక్ వచ్చింది. సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 వెబ్ సిరీస్‌లు మంచి పేరు తెచ్చాయి. రీసెంట్గా ‘వికటకవి’ సిరీస్‌కి వర్క్ చేశాను. చూసినవారంతా మ్యూజిక్‌ని మెచ్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది’ అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘వికటకవి’ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఆదివారం అజయ్ అరసాడ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రదీప్ మద్దాలి క్లారిటీ గల దర్శకుడు. అందుకే ఈ సిరీస్‌కి వర్క్ చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. ‘వికటకవి’కి పనిచేయడం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సంగీత దర్శకుడిగా నాకు సంతృప్తినిచ్చిన సిరీస్ ఇది.’ అని తెలిపారు అజయ్ అరసాడ