కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh). ఈ టాలెంటెడ్ హీరోయిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ బ్యూటీ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం డ్రైవర్ జమున డిసెంబర్ 30న విడుదల కానుంది. అయితే మరో సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ (The Great Indian Kitchen) కూడా ఈ నెల చివరలో విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడ్డది. కొత్త తేదీ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంది.
సూపర్ హిట్ మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు ఇది తమిళ రీమేక్. ఇదే టైటిల్‌తో తమిళంలో కూడా తెరకెక్కుతుండగా రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తున్నాడు. దుర్గారాం, నీలమ్ చౌదరి నిర్మిస్తు్న్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. 2022, 2023 క్యాలెండర్ ఇయర్స్ లో వరుస సినిమాలకు సైన్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఐశ్వర్యా రాజేశ్.
ఈ భామ ప్రస్తుతం మలయాళంలో నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తమిళంలో ఐశ్వర్యారాజేశ్ నటిస్తున్న సినిమాలు ఏకంగా 10 ఉన్నాయంటే ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ, తమిళ భాషల్లో మరో సినిమా కూడా చేస్తోంది. ఈ లెక్కన ఐశ్వర్యారాజేశ్ వచ్చే ఏడాది కూడా మొత్తం తీరిక లేకుండా సినిమాలకే కేటాయించబోతుందని అర్థమవుతుంది.
డ్రైవర్ జమున ట్రైలర్..