ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఫర్హానా’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను నాయిక రష్మిక మందన్న విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ మాట్లాడుతూ…‘తన కుటుంబాన్ని పోషించడం కోసం ఫర్హానా అనే యువతి కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరుతుంది. ఈ ఉద్యోగం చేయడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. దీంతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు. శ్రీరాఘవ, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : గోకుల్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్.