ఐశ్వర్య రాజేష్ చేతిలో అరడజన్ సినిమాలు
ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌తో బిజీగా ఉంది.

ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. రెండేళ్ల కింద కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ సువర్ణ పాత్ర మాత్రం సక్సెస్ అయింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. పక్కా పల్లెటూరి పిల్లగా మైమరిపించింది ఐశ్వర్య రాజేష్. దాని తర్వాత వరసగా తెలుగులో నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేతిలో 7 సినిమాలు ఉన్నాయంటే నమ్మడం కాస్త కష్టమే. స్టార్ హీరోయిన్లకు కూడా ఇది కలే. అలాంటిది ఐశ్వర్య రాజేష్ మాత్రం ఒకేసారి అరడజన్ కంటే ఎక్కువ సినిమాలనే లైన్ లో పెట్టింది. అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తోంది.

ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు తెలుగు, తమిళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా అందం కంటే కూడా అభినయంతోనే ఎక్కువ అవకాశాలు అందుకుంటుంది. అదృష్టం కలిసి రాకపోవడంతో చాలా కాలం ఈమెకు గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది ఈ భామ. ఇప్పుడు తమిళనాట ఈమె స్టార్ హీరోయిన్ అయింది. తెలుగులోనూ వరస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఈ అమ్మడు చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. మరో మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అంటే మొత్తంగా 10 సినిమాల కంటే పైగానే నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే రెండు తమిళం.. రెండు తెలుగు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తెలుగులో నాని టక్ జగదీష్.. సాయి తేజ్ రిపబ్లిక్.. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉంది. తమిళనాట మూడు నాలుగు సినిమాలున్నాయి. అక్కడ కూడా స్టార్ హీరోలతో సినిమా చేస్తుంది. తెలుగమ్మాయే అయినా కూడా తమిళనాడులోనే పుట్టి పెరగడంతో అక్కడమ్మాయి అయిపోయింది ఐశ్వర్య రాజేష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అంజలి .. ఈసారైనా నిలదొక్కుకుంటుందా
అఖండ బ్లాక్ బస్టర్.. నారా లోకేష్ ట్వీట్
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఓటీటీలో వకీల్ సాబ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వీక్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

