పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వీక్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?
వకీల్ సాబ్ కలెక్షన్స్ | ఈ సినిమా కలెక్షన్లను కూడా బయటకు చెప్పడం లేదు. వీలైనంత వరకు గోప్యంగా ఉంచడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఎలా వస్తున్నాయి అని అడగకూడదు.. ఎందుకంటే పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. కానీ ఈ సారి మాత్రం కరోనా వైరస్ ఉంది కాబట్టి దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త కంగారు పడుతున్నారు. కానీ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యాక తొలి మూడు రోజులు వైరస్‌ను కూడా పక్కనపెట్టి అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల ముందు జాతర వాతావరణం కనిపించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూపించిన అభిమానంతో తొలి మూడు రోజుల్లో సుమారు రూ.60 కోట్లు వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా.
అయితే నాలుగో రోజు నుంచి పరిస్థితి ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఈ సినిమా కలెక్షన్లను కూడా బయటకు చెప్పడం లేదు. వీలైనంత వరకు గోప్యంగా ఉంచడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో జరుగుతున్న టికెట్ల గొడవ కారణంగా వకీల్ సాబ్ కలెక్షన్స్ బయటకు చెప్పడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత వైరస్ ప్రభంజనంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పైగా ఉగాది సెలవులు కూడా ఉండడంతో మరో రెండు మూడు రోజులు వకీల్ సాబ్ కలెక్షన్లకు తిరుగులేదు. అన్నింటికీ మించి ఇప్పట్లో కొత్త సినిమాలు ఏవీ విడుదల చేయడం లేదు. దాంతో ఉన్నది ఒకటే సినిమా వకీల్ సాబ్ మాత్రమే. ఇప్పటికీ రోజుకు కనీసం రూ.5 నుంచి రూ.7 కోట్ల షేర్ ఈ సినిమాకు తీసుకు వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పవన్ సినిమా రూ.70 కోట్ల మార్క్ అందుకుందని.. మరో 20 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా వైరస్ ఇంత దారుణంగా విజృంభిస్తున్న సమయంలో కూడా పవన్ ఈ స్థాయి వసూళ్లు కురిపించాడు అంటే.. ఈయన పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ మానియా మొదలైతే ఎలా ఉంటుందో వకీల్ సాబ్ మరోసారి నిదర్శనంగా నిలిచింది. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఫెస్టివల్ లుక్‌లో సాయిపల్లవి..న్యూ పోస్టర్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఓటీటీలో వకీల్ సాబ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

